Share News

KTR: తెలంగాణలో బీజేపీ బలం గాలివాటమే

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:03 AM

తెలంగాణలో కాంగ్రె్‌సకు బీజేపీ ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదని, ఇక్కడ బీజేపీ బలం కేవలం గాలివాటమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు

KTR: తెలంగాణలో బీజేపీ బలం గాలివాటమే

  • బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రానికి మంచి రోజులు.. మునిసి‘పోల్స్‌’లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోరు

  • రేవంత్‌ రెడ్డి నిజాయితీగల మోసగాడు

  • ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆయన బూతులు మాట్లాడుతున్నారు

  • దయనీయంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదని, ఇక్కడ బీజేపీ బలం కేవలం గాలివాటమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నేతలంతా ఘోర ఓటమి పాలయ్యారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని పేర్కొన్నారు. ‘బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం గతంలో లేదు.. భవిష్యత్తులో కూడా రాద’న్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే తెలంగాణకు మంచి రోజులని.. ఇతర పార్టీల వల్ల కాదని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన మునిసిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే పోరు ఉంటుందని, బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేస్తున్నా.. కృష్ణా జలాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తుకు వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ నేత హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. కాగా, రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు.


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో వెనుకటి రోజులు తెస్తానని, మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి నిజాయితీగల మోసగాడని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలు రావని, ఆయనకు వచ్చిందొక్కటే బూతుల భాష అని ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయాలని అడిగితే బూతుల భాషలో మాట్లాడుతున్నారని విమర్శించా రు. కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలమని చెబుతూ స్పీకర్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ పార్టీ అంటున్నారని కేటీఆర్‌ అన్నారు.

టీఏసీసీయూ క్యాలెండర్‌ ఆవిష్కరణ

తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ కౌన్సిలర్‌ యూనియ న్‌ (టీఏసీసీయూ) 2026 క్యాలెండర్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. టీఏసీసీయూ రాష్ట్ర అధ్యక్షుడు బొద్దిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 04:05 AM