Share News

పేదల భూములే దొరికాయా?

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:07 AM

ప్రజలకు ఇచ్చిన హామీల అమలును గాలికొదిలేసి.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల భూములపై పడిందని, పరిశ్రమలకు భూ ేసకరణ పేరుతో

పేదల భూములే దొరికాయా?

  • బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టును ఖండిస్తున్నాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన హామీల అమలును గాలికొదిలేసి.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల భూములపై పడిందని, పరిశ్రమలకు భూ ేసకరణ పేరుతో ఆక్రమణకు దిగడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్‌, రాపోలు గ్రామాల్లో ఇండస్ర్టియల్‌ పార్క్‌ పేరుతో రైతులనుంచి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొంటున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలను గృహనిర్బంధం, అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 06:07 AM