Share News

స్పీకర్‌ను ధృతరాష్ట్రుడితో పోల్చుతారా..?

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:41 AM

శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ధృతరాష్ట్రుడితో పోల్చుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.

స్పీకర్‌ను ధృతరాష్ట్రుడితో పోల్చుతారా..?

  • కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆయనకు స్పీకర్‌ నోటీసులివ్వాలి: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ధృతరాష్ట్రుడితో పోల్చుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తిని అగౌరవ పరిచేలా కేటీఆర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే స్పీకర్‌ నోటీసులు జారీ చేయాలని కోరుతున్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరారని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాము స్పీకర్‌ను కలిశామని తెలిపారు. అయితే, యాదయ్య బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారని స్పీకర్‌ తీర్పునిచ్చారని చెప్పారు. స్పీకర్‌ వ్యవహారం మహాభారతంలో ధృతరాష్ట్రుడిలా ఉందని విమర్శించారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా ధృతరాష్ట్రుడు ఏమీ కనబడనట్లు నటించేవారని.. ఇవాళ స్పీకర్‌ పరిస్థితి కూడా అలాగే ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 03:41 AM