Share News

10, 11తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు: కేటీఆర్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:46 AM

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబరు 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు నిచ్చారు

10, 11తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు: కేటీఆర్‌
Ktr

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబరు 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ కీలకమైన ఆశయమంటూ గురువారం ఆయన ఓ ప్రకటన చేశారు. కాగా, జర్నలిస్టు రేఖా ముదిరాజ్‌కు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని కేటీఆర్‌ ప్రకటించారు. పసిపిల్లతో ఉన్న మహిళా జర్నలిస్టును పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి విచారణ చేశారని కేటీఆర్‌ ఆరోపించారు.

Updated Date - Oct 09 , 2026 | 06:51 AM