ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ హత్య: కేటీఆర్
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:57 AM
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి సర్కారు చేసిన హత్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి సర్కారు చేసిన హత్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పార్థివదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావ్.. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు.