Share News

అరాచకంలో రేవంత్‌కు హిట్లరే ఆదర్శం: కేటీఆర్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:07 AM

ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ ఆదర్శం కాబట్టే.. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్నిరకాల అరాచకాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు

అరాచకంలో రేవంత్‌కు హిట్లరే ఆదర్శం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ ఆదర్శం కాబట్టే.. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్నిరకాల అరాచకాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటుచేసిన ‘హైడ్రా సంస్థ, పనితీరుకు జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ చర్యలే స్ఫూర్తి అని సీఎం బహిరంగంగా ఒప్పుకోవడం అభ్యంతరకరమని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. తన నోటితోనే తన ఫాసిస్ట్‌ ఆలోచనలను బయటపెట్టిన రేవంత్‌రెడ్డి నిరంకుశ మనస్తత్వం తెలంగాణకే కాకుండా.. ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 06:08 AM