Share News

రేవంత్‌.. మీ రక్తదాహం ఇంకా తీరడం లేదా..?

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:34 AM

రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ.. 60 ఏళ్లుగా తెలంగాణ నెత్తురు తాగారు.. మీ రక్తదాహం ఇంకా తీరలేదా..? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

రేవంత్‌.. మీ రక్తదాహం ఇంకా తీరడం లేదా..?

  • రైతుల కోసం రక్తాన్ని ధారపోస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ.. 60 ఏళ్లుగా తెలంగాణ నెత్తురు తాగారు.. మీ రక్తదాహం ఇంకా తీరలేదా..? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేయిమందిని బలి తీసుకున్న మృగాలు మీరు.. తెలంగాణ బిడ్డల రక్తంతో చేతులు తడిచిన కాంగ్రెస్‌ పార్టీ తోడేళ్లమాదిరి రక్తం రుచి మరిగింది. పేగులు తెగేదాకా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తామనే కర్కశ కాంగ్రెస్‌ ప్రభుత్వం కోరుతుంటే రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఆదివారం ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. కాగా, రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తే.. బీఆర్‌ఎస్‌ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో.. సోమవారం తెలంగాణ భవన్‌లో రేవంత్‌రెడ్డికోసం రక్తదానం కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 13 , 2026 | 04:35 AM