Share News

బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కేటీఆర్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:31 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శ్రేణులకు సూచించారు.

బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కేటీఆర్‌

  • మునిసిపల్‌ ఎన్నికల సమన్వయకర్తల ప్రకటన

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శ్రేణులకు సూచించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పార్టీ ప్రత్యేక సమన్వయకర్తలను నియమించిన ఆయన.. శనివారం జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీకి ఒక సీనియర్‌ నాయకుడిని ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడం సమన్వయకర్తల బాధ్యత అని పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:31 AM