సీఎం బంధువు ఆస్పత్రి 28వ అంతస్తులో భగీరథ్‌ను దాచారు
ABN , Publish Date - May 23 , 2026 | 05:38 AM
ముఖ్యమంత్రి ఒక పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టిన సందర్భం దేశంలో ఎక్కడాలేదు. భగీరథ్‌ను సీఎం సమీప బంధువు ఆస్పత్రిలోని 28వ అంతస్తులో తొమ్మిది రోజులు దాచిపెట్టారు...
రేవంత్‌రెడ్డి, సంజయ్ తోడు దొంగలు
ఆడబిడ్డకు అన్యాయం చేసిన వెధవెవరో చెప్పాలి: కేటీఆర్
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి ఒక పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టిన సందర్భం దేశంలో ఎక్కడాలేదు. భగీరథ్‌ను సీఎం సమీప బంధువు ఆస్పత్రిలోని 28వ అంతస్తులో తొమ్మిది రోజులు దాచిపెట్టారు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పొద్దున తానొక వీడియో చూశానని, 9 రోజులు ఆ పిల్లవాడిని మెడికోవరో ఏదో.. అందులో 28వ అంతస్తులో దాచిపెట్టినట్లు చెబుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ తోడు దొంగలని, భగీరథ్‌ను కాపాడేందుకు ఇద్దరూ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని ఓ ఆడబిడ్డ బయటకు వస్తే.. తమ రాజకీయాల కోసం కౌంటర్ కేసు పెట్టించి ఆమెకు అన్యాయం చేసిన వెధవ ఎవరో చెప్పాలని వారిద్దరికీ సవాల్ విసిరారు. ఆడబిడ్డ తన తల్లిదండ్రులతో కలిసి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర వేదనకు గురిచేసింది ఎవరని అని నిలదీశారు. దేశంలో ఎక్కడైనా పోక్సో కేస్ నిందితులు 9 రోజులు తప్పించుకోలేరని, కేవలం ముఖ్యమంత్రి అండదండలు ఉండటంవల్లే తప్పించుకున్నారన్నారు. బాలిక విషయంలో తాము రాజకీయం చేయలేదని, సీఎం తమపై విమర్శలు చేసిన కారణంగానే ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తోందన్నారు. పోక్సో కేసులో జరుగుతున్న అన్యాయంపై తాను ప్రశ్నిస్తే.. ‘మా బావమరిది ఇంటిపై డ్రగ్స్ దాడి జరిగింది’ అంటూ మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే కేసుపెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్లపై.. పంటల వారీగా ఒక శ్వేతపత్రం.. లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు 80ు కొనుగోళ్లు పూర్తయ్యాయని ఎక్కడైనా నిరూపిస్తే తాను ఏ శిక్షకేౖనా సిద్ధమని సవాల్ విసిరారు.