KTR: రేవంత్ టీడీపీ పాట వెనుక కుట్ర
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:45 AM
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర బయటపడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బీజేపీతోనూ చీకటి ఒప్పందం: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర బయటపడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టంచేసేలా జల హక్కులను కాలరాశారని, ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్‌రెడ్డి ఏ క్షణమైనా దాన్నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎ్‌సను రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు సీఎం పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు.