లిక్కర్ కేసుతో ఎన్నికల్లో నష్టపోయాం
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:03 AM
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు వల్ల గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
చివరకు కవితకు కోర్టులో న్యాయం జరిగింది: కేటీఆర్
హైదరాబాద్, పిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు వల్ల గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు చివరకు కోర్టులో న్యాయం జరిగిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని కూల్చారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులాగే రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుదని అన్నారు. అప్పటివరకు కాంగ్రెస్, బీజేపీలు చేేస బాధ్యతారహితమైన ఆరోపణలను ఎదుర్కొంటామని తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుత మన నవ భారతంలో ఆరోపణలే సాక్ష్యాలుగా మారుతున్నాయని, మీడియానే న్యాయ ప్రక్రియ చేపడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, చివరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.