తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చిన రేవంత్
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:18 AM
తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడమే కాకుండా.. తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్‌రెడ్డి ఏకైక ఎజెండా అని బీఆర్‌ఎస్...
రాష్ట్ర సంపదను ఢిల్లీకి ధారబోస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడమే కాకుండా.. తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్‌రెడ్డి ఏకైక ఎజెండా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా తెలంగాణను ఏఐసీసీకి డబ్బులు ఇచ్చే.. ఏటీఎంలా మార్చారని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గతంలో ఈ విషయంపై అనేకసార్లు హెచ్చరించామని, ఇదే విషయాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకొన్నారని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారిమళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్ఠానానికి ధారబోస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.