Share News

కాళేశ్వరాన్ని కూల్చేందుకు రేవంత్‌ సర్కార్‌ కుట్ర

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:22 AM

కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు, మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుతంత్రాలకు తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

కాళేశ్వరాన్ని కూల్చేందుకు రేవంత్‌ సర్కార్‌ కుట్ర

  • మేడిగడ్డ తరహాలోనే అన్నారంపై కుతంత్రాలు: కేటీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు, మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుతంత్రాలకు తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద భారీ ఎక్స్‌కవేటర్లతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, సూర్యాపేట జిల్లాలోని మైనింగ్‌ బ్లాక్‌ల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రస్థాయిలో అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

Updated Date - Mar 03 , 2026 | 03:22 AM