Share News

చేనేతల పొట్టకొడుతున్న సర్కార్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:41 AM

కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఆర్డర్లిస్తూ.. రేవంత్‌ సర్కార్‌ రాష్ట్రంలోని చేనేత సంఘాల కార్మికుల పొట్టకొడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

చేనేతల పొట్టకొడుతున్న సర్కార్‌

  • కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఆర్డర్లిస్తూ.. రేవంత్‌ సర్కార్‌ రాష్ట్రంలోని చేనేత సంఘాల కార్మికుల పొట్టకొడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వసంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దుచేసి ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వడం అన్యాయమని గురువారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలుకుతున్నదని, ఇది ప్రజాప్రభుత్వమా... ‘ప్రైవేట్‌’ లిమిటెడ్‌ కంపెనీయా? అని ప్రశ్నించారు. రూ.105 కోట్ల స్కూల్‌ యూనిఫామ్‌ఆర్డర్‌ను వెనక్కుతీసుకోవడం వెనుక మతలబు ఏంటి? సంక్షేమశాఖ నుంచి టెస్కోకు దక్కాల్సిన రూ.200కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్‌ ఇంకా ఇవ్వకపోవడానికి కారణం చెప్పాలని నిలదీశారు. నేతన్నల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 04:41 AM