Share News

నారాయణ విద్యార్థికి అండర్‌-6 చెస్‌లో ఇండియాలో మూడో ర్యాంక్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:25 AM

నారాయణ స్కూల్‌ విద్యార్థి క్షివ్‌ చకావే ‘ఎల్‌బీహెచ్‌ఎం ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌’ అండర్‌-6 విభాగంలో ఇండియాలో మూడో ర్యాంకు...

నారాయణ విద్యార్థికి అండర్‌-6 చెస్‌లో ఇండియాలో మూడో ర్యాంక్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నారాయణ స్కూల్‌ విద్యార్థి క్షివ్‌ చకావే ‘ఎల్‌బీహెచ్‌ఎం ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌’ అండర్‌-6 విభాగంలో ఇండియాలో మూడో ర్యాంకు, ప్రపంచస్థాయిలో పదో ర్యాంకు సాధించి ట్రోఫీని కైవశం చేసుకున్నాడని నారాయణ విద్యా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిడే, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ గుర్తింపు పొందిన ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా 200మంది పాలొన్నారు. క్షివ్‌ చకావే 1560 ఫిడే రేటింగ్‌ను సాధించాడని, తద్వారా అండర్‌-6 విభాగంలోని టాప్‌ టెన్‌ క్రీడాకారులలో ఒకరిగా నిలవడంతో పాటు, మహారాష్ట్రలో తన వయసు విభాగంలో నంబర్‌-1 ర్యాంకు దక్కించుకున్నాడని విద్యా సంస్థ పేర్కొంది. క్షివ్‌ ప్రస్తుతం జూన్‌ 7 నుంచి 11 వరకు జరగనున్న నేషనల్‌ అండర్‌-7 చెస్‌ చాంఫియన్‌షి్‌పలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడని తెలిపింది నారాయణ విద్యా సంస్థల డెరెక్టర్‌ పి.సింధూర నారాయణ క్షివ్‌ను అభినందించారు. తమ సంస్థ విద్యార్థులు చదువులో, క్రీడల్లో, ప్రపంచస్థాయి పోటీ వేదికలపై రాణించేలా నిరంతరం కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - Mar 24 , 2026 | 05:25 AM