Share News

రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:02 AM

పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌. శ్రీనివాసరాజును ప్రభుత్వం తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ-రెరా) చైర్మన్‌గా నియమించింది.

రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు

హైదరాబాద్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌. శ్రీనివాసరాజును ప్రభుత్వం తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ-రెరా) చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో 175ను జారీ చేసింది. రెరా చట్టం 2016లోని సెక్షన్‌ 22, తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రూల్స్‌-2017లోని రూల్‌ 17 ప్రకారం ఈ నియామకాన్ని చేపట్టింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అక్రమాలను నియంత్రించడం, ప్రాజెక్టుల నమోదు పర్యవేక్షించడం, బిల్డర్లు, వినియోగదారుల మధ్య వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే సంస్థగా రెరా వ్యవహరిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి వేముల శ్రీకర్‌ను టీజీ రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో టెక్నికల్‌/అడ్మినిస్ర్టేటివ్‌ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ మెట్రోపాలిటిన్‌ ఏరియా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ జీవో 176ను జారీ చేసింది.

Updated Date - Jun 28 , 2026 | 03:02 AM