Share News

తెలంగాణ ఫిర్యాదుపై మీరేమంటారు?

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:08 AM

కృష్ణా జలాల అంశంలో ఏపీ తీరుపై తెలంగాణ చేసిన ఫిర్యాదుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పందించింది.

తెలంగాణ ఫిర్యాదుపై మీరేమంటారు?

  • ఏపీకి కృష్ణాబోర్డు లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల అంశంలో ఏపీ తీరుపై తెలంగాణ చేసిన ఫిర్యాదుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పందించింది. తెలంగాణ ఫిర్యాదుపై మీ అభిప్రాయం చెప్పండంటూ ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఇప్పటికే 661 టీఎంసీలను వాడుకోగా, ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా 2.45 టీఎంసీలే మిగిలి ఉన్నాయని జనవరి 27న కేఆర్‌ఎంబీకి అప్పటి ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ లేఖ రాశారు. ఏపీ వాటాకు మించి నీటిని తరలించినందునా ఆ రాష్ట్ర ఖాతాలో నీళ్లు మిగలవని తెలంగాణ నివేదించింది. తమ రాష్ట్ర హక్కుగా లభించాల్సిన వాటా జలాలను పూర్తిగా తామే వాడుకుంటామని, ఇందుకుగాను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని తెలంగాణ కోరింది.

Updated Date - Feb 07 , 2026 | 04:08 AM