నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టుల డీపీఆర్ మదింపు ఎలా?
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:25 AM
తెలుగు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఏ విధంగా మదింపు చేయాలి... అలాగే ఇప్పటికే నీటి వినియోగానికి రక్షణ ఉన్న ప్రాజెక్టుల పరిధి....
ఉన్న ప్రాజెక్టుల్లో మార్పులు జరిగితే మదింపు ఎలా?
మార్గదర్శకాలు ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కృష్ణాబోర్డు లేఖ
తెలుగు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఏ విధంగా మదింపు చేయాలి... అలాగే ఇప్పటికే నీటి వినియోగానికి రక్షణ ఉన్న ప్రాజెక్టుల పరిధి, ఆయకట్టు, సామర్థ్యం, నీటి వినియోగంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటి డీపీఆర్‌లను ఏ విధంగా మదింపు చేయాలో స్పష్టతనివ్వాలని కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ)ని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల అప్రైజల్ విభాగం డైరెక్టర్‌కు బోర్డు లేఖ రాసింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకి ఏ మేరకు విస్తరణ చేపట్టారో నిర్థారించడానికి వాటికి గతంలో సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఇచ్చిన అనుమతుల వివరాలు ఇవ్వాలని కోరింది.