Share News

ఏ రాష్ట్రాన్నీ దండించే అధికారం మాకు లేదు

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:25 AM

నీళ్లను అక్రమంగా తరలించే రాష్ట్రాలను శిక్షించే అధికారం తమకు లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తేల్చిచెప్పింది. ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొంది.

ఏ రాష్ట్రాన్నీ దండించే అధికారం మాకు లేదు

  • ఆ అధికారం కేంద్రానిదే.. కృష్ణా జలాల అక్రమ తరలింపుపై బోర్డు స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): నీళ్లను అక్రమంగా తరలించే రాష్ట్రాలను శిక్షించే అధికారం తమకు లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తేల్చిచెప్పింది. ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలకు ఈ నెల 8న లేఖ రాసింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీటి తరలింపుతో పాటు ఇతర అంశాలను పరస్పర సహకారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది. తాత్కాలిక నీటి వినియోగానికి సంబంధించి 2015లో కేంద్ర జలశక్తి శాఖ వద్ద తెలుగు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిందని, దాని ప్రకారం ముందుకెళ్లాలని సూచించింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో ఏపీ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాన్ని ఖాళీ చేస్తోందని ఇటీవల తెలంగాణ చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ కృష్ణా బోర్డు బదులిచ్చింది. తమ తాగు, సాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వలను పరిరక్షించడానికి, విద్యుదుత్పత్తి చేయకుండా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ కోరింది. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని కృష్ణా బోర్డు బదులిచ్చింది.

Updated Date - Apr 17 , 2026 | 04:25 AM