Share News

ప్రాజెక్టులు అప్పగించకుండా నియంత్రణ ఎలా?

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:29 AM

కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులను 2021 కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం అప్పగిస్తేనే వాటి నుంచి నీటి విడుదలపై నియంత్రణ సాధ్యం అవుతుందని...

ప్రాజెక్టులు అప్పగించకుండా నియంత్రణ ఎలా?

  • తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్‌, విజయపురిసౌత్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులను 2021 కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం అప్పగిస్తేనే వాటి నుంచి నీటి విడుదలపై నియంత్రణ సాధ్యం అవుతుందని, అప్పటిదాకా నీటి వినియోగం లెక్కలు మాత్ర మే చూడగలమని కృష్ణానది యాజ మాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచే అంశంపై జస్టిస్‌ బ్రిజేష్‌‌కుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా ట్రైబ్యునల్‌-2)లో విచారణ జరుగుతుందని, అక్కడ నీటి వాటాలు తేలనంత వరకు నీటి పంపిణీపై బోర్డు కు అధికారాల్లేవని తేల్చి చెప్పింది. ఈమేరకు తెలంగాణ, ఏపీ ఈఎన్‌సీలకు కృష్ణాబోర్డు లేఖ రాసింది. ట్రైబ్యునల్‌ ఆ దేశిస్తేనే కృష్ణాబోర్డు నీటి నియంత్రణకు చర్యలకు ఉపక్రమించగలదని పేర్కొంది. నీటి పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్గత ఒప్పందం లేదని, రాష్ట్రాల మధ్య స్పష్టమైన నీటి కేటాయింపులు లేనందువల్ల ఉమ్మడి జలాశయాల నీటి నియంత్రణ అధికా రం బోర్డుకు లేదని తెలిపింది. కాగా, కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎస్‌. బిశ్వాస్‌ సోమవా రం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.

Updated Date - Mar 24 , 2026 | 05:29 AM