జల వివాదాల్లో జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:51 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లో జోక్యం చేసుకోబోమని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పునరుద్ఘాటించింది.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లో జోక్యం చేసుకోబోమని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పునరుద్ఘాటించింది. రాష్ట్రాల వారీగా నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా ట్రైబ్యునల్-2)లో విచారణ జరుగుతోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలకు కృష్ణాబోర్డు లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించకుండా, జలవిద్యుదుత్పత్తి చేయకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాయగా... కృష్ణా బోర్డు స్పందించింది. త్రిసభ్య కమిటీ(తెలంగాణ, ఏపీ ఈఎన్‌సీలు, కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ) సమావేశాల్లో పరస్పరం అంగీకారంతో ముందుకెళ్లాలని సూచించింది.