Share News

కృష్ణా ప్రాజెక్టులకు జలకళ

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:26 AM

కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీటి ప్రవాహం పెరిగింది. గురువారం శ్రీశైలానికి 57,298 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 58 వేలు..

కృష్ణా ప్రాజెక్టులకు జలకళ

గద్వాల, హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరదనీటి ప్రవాహం పెరిగింది. గురువారం శ్రీశైలానికి 57,298 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 58 వేలు, జూరాలకు 75 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో పది గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు 48,111 క్యూసెక్కులు, తుంగభద్రకు 12 వేలు, నాగార్జునసాగర్‌కు 34 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది.

Updated Date - Aug 21 , 2026 | 06:27 AM