పొత్తు.. విచిత్రం
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:34 AM
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆసక్తికర రాజకీయ సమీకరణలకు వేదికగా మారింది. శుక్రవారం పాల్వంచ డివిజన్..
మంత్రి పొంగులేటి రోడ్‌షోలో టీడీపీ జెండాలు
కొత్తగూడెం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆసక్తికర రాజకీయ సమీకరణలకు వేదికగా మారింది. శుక్రవారం పాల్వంచ డివిజన్, ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్, సీపీఎం జెండాలతో పాటు టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తుండగా.. సీపీఐ, టీడీపీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. సీపీఐ తన మిత్రపక్షమైన టీడీపీకి మూడు డివిజన్లు కూడా కేటాయించింది. అయితే, పాల్వంచలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి చేపట్టిన రోడ్ షోలో, ప్రత్యర్థి కూటమికి చెందిన టీడీపీ జెండాలు ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.