Share News

Durgam Cheruvu FTL: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోకొత్త ప్రభాకర్‌ రెడ్డి కబ్జా

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:13 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భూమి అంటే బంగారమే.. అందునా హైటెక్‌ సిటీకి కూత వేటు దూరంలో దుర్గం చెరువు ప్రాంతమంటే సిరుల వర్షమే....

Durgam Cheruvu FTL: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోకొత్త ప్రభాకర్‌ రెడ్డి కబ్జా

  • హైడ్రా ఫిర్యాదుతో మాదాపూర్‌ పీఎస్‌లో కేసు

  • నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/హైటెక్‌ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భూమి అంటే బంగారమే.. అందునా హైటెక్‌ సిటీకి కూత వేటు దూరంలో దుర్గం చెరువు ప్రాంతమంటే సిరుల వర్షమే. దుర్గం చెరువు ఆక్రమణలకు గురైంది. దీంతో హైడ్రా అధికారుల ఫిర్యాదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మరో వ్యక్తి వెంకటరెడ్డిలపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు వద్ద ఆక్రమణలను తొలగించి, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు కావడంతో రాజకీయంగా కలక లం రేపుతోంది. 2025 డిసెంబరు 31న దుర్గం చెరువు చుట్టూ కబ్జాలను తొలగిస్తున్నప్పుడే చెరువు ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో మట్టితో చదును చేసి.. భారీగా వాహనాలను పార్కిం గ్‌ చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అలా పార్కింగ్‌ చేసిన బస్సులు సోనీ ట్రావెల్‌ సర్వీస్‌ సంస్థకు చెందినవని.. ఆ సంస్థ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిదని తేలింది. దీంతో దుర్గం చెరువు కబ్జాలపై మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 5 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదులో తెలిపారు. కానీ, ఆ ఆక్రమణలతో తనకు సంబంధం లేదని ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై ‘హైడ్రా’ స్పందిస్తూ.. ‘దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 5 ఎకరాల భూమిలో మట్టి పోసి నింపడం వాస్తవం. ఈ సంగతిని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) శాటిలైట్‌ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. అది ప్రభుత్వ భూమా..? ప్రైవేటు భూమా..? అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలోనిదా అన్న విషయం పక్కన బెడితే.. చెరువు ఎఫ్‌టిఎల్‌ పరిధిలో మట్టి పోయడం నిబంధనల ఉల్లంఘనే. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పట్టా భూమి ఉన్నా.. అక్కడి భౌగోళిక స్వ రూపం మార్చేలా.. నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధం’ అని పేర్కొంది. ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన జీహెచ్‌ఎంసీ.. పక్కన వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేసింది. కాగా, ‘దుర్గం చెరువును హైడ్రా సందర్శించిన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి.. ఆ ఏరియా అధికారికి ఫోన్‌ చేశారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలు తేవాలని ఆ ఏరియా హైడ్రా అధికా రి కోరినా సమర్పించలేదు’ అని అధికారులు చెప్పా రు. ఆ స్థలంలోని పబ్‌ యజమాని, ఎస్‌టీఎస్‌ ట్రావె ల్స్‌ నిర్వాహకులు కొత్త ప్రభాకర్‌రెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులని తమ విచారణలో తేలిందన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెచ్చే పత్రాలను పరిశీలించాకే హైడ్రా ఫిర్యాదుకనుగుణంగా చర్యలు తీసుకుంటారని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ మోహన్‌ తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 03:13 AM