కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:32 AM
శాసనసభలో దళిత ప్రజాప్రతినిధులను అవమానించడాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ తీవ్రంగా ఖండించారు.
దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : శాసనసభలో దళిత ప్రజాప్రతినిధులను అవమానించడాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ తీవ్రంగా ఖండించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గత ప్రభుత్వ పాలనలో ధరణి వ్యవస్థతో జరిగిన భూకబ్జాలపై మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన వైపు వేలుచూపిస్తూ.. ‘చంపేస్తా’ అంటూ సైగ చేశారని, దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి అని, కౌశిక్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని శంకర్ మాదిగ డిమాండ్ చేసారు.