Share News

రైతులను రెచ్చగొట్టొద్దు: కోదండరెడ్డి

ABN , Publish Date - May 13 , 2026 | 04:33 AM

రైతులను రెచ్చగొట్టొద్దని, రైతు సమస్యలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం కంటే, వారి పరిష్కారానికి సహకరించాలని రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి కోరారు..

రైతులను రెచ్చగొట్టొద్దు: కోదండరెడ్డి

చేగుంట/మిరుదొడ్డి, మే 12 (ఆంధ్రజ్యోతి): రైతులను రెచ్చగొట్టొద్దని, రైతు సమస్యలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం కంటే, వారి పరిష్కారానికి సహకరించాలని రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి కోరారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్‌ కమిటీని మంగళవారం ఆయన సందర్శించారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి తీసుకువచ్చిన రైతులతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ.. మాజీమంత్రి హరీశ్‌రావు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే పరిమితం కాకుండా రైతుల సమస్యలను సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు.

Updated Date - May 13 , 2026 | 04:33 AM