జై భజరంగభళి..
ABN , Publish Date - May 13 , 2026 | 04:24 AM
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి.
కొండగట్టులో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి
అంజన్నను దర్శించుకున్న లక్షన్నరకు పైగా భక్తులు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. స్వామి వారికి ప్రత్యేక అలంకారం, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు దాదాపు లక్షన్నర మందికిపైగా భక్తులు అంజన్నను దర్శించుకోగా.. కొండంతా జనంతో కిక్కిరిసిపోయింది. లక్షలాదిగా దీక్షాపరులు కొండపైకి చేరుకుని దీక్షలు విరమించారు
- మల్యాల, మే 12(ఆంధ్రజ్యోతి)