బీఆర్‌ఎస్, కాంగ్రెస్... దొంగలనే దోచుకునే దొంగలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:35 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఆ పార్టీల నేతలు దొంగలనే దోచుకునే దొంగలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం....
నయీం కబ్జా భూములను పంచలేదేం? ఎంపీ కొండా
యాదాద్రి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఆ పార్టీల నేతలు దొంగలనే దోచుకునే దొంగలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో గ్యాంగ్‌స్టర్ నయీం నివసించిన ‘నయీమ్ మంజిల్’ వద్ద ఎంపీ ఓ వీడియోను చిత్రీకరించారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులు, కబ్జా చేసిన భూములను పంచుతామని గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రకటించాయని, మరి ఎందుకు పంచలేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్ అమలులో విఫలమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి మొత్తం కేంద్ర నిధుల ద్వారానే జరుగుతుంటే సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంపైనే నిందలు వేస్తున్నారని, ఇది తగదని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.