సత్యనారాయణపై దాడి హేయం: కొండా సురేఖ
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:13 AM
ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ...
నిమ్స్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆదివారం ఆమె పరామర్శించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సత్యనారాయణ స్వీయ పరిరక్షణలో అభివృద్ధి చేసిన 70 ఎకరాల అటవీ క్షేత్రానికి వనమహోత్సవం కార్యక్రమ నిధులతో సంరక్షణ పనులు చేపడతామని ఆమె హామీనిచ్చారు. ప్రకృతి శక్తులు సహకరించడం వల్లనే సత్యనారాయణపై దాడి జరిగినా ప్రాణాలతో బయటపడ్డారన్నారు.