Share News

కోడ్‌ అమల్లో ఉండగా కొత్త చట్టాలెలా తెస్తారు?

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:39 AM

పలు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో కొత్త చట్టాల కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

కోడ్‌ అమల్లో ఉండగా కొత్త చట్టాలెలా తెస్తారు?

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పలు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో కొత్త చట్టాల కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం, తిప్పర్తి మండల కేంద్రాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌ పూర్తిగా మద్దతు ఇస్తోందన్నారు. అయితే, ఈ బిల్లు చాటున దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా డీలిమిటేషన్‌ బిల్లును తేవడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 15 , 2026 | 04:39 AM