ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:59 AM
ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఆయన సలహాలు, సూచనలను స్వీకరిస్తాం : కోమటిరెడ్డి
సంగారెడ్డి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు. పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ సలహాలు, సూచనలను స్వీకరిస్తామని ఆదివారం సంగారెడ్డిలో కోమటిరెడ్డి మీడియాకు చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆయన ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని గుర్తుచేశారు. ‘పక్క రాష్ట్రంలో జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు. ఈ రాష్ట్రంలో మీకు ప్రతిపక్ష హోదా ఉంది. మేం చేస్తున్న మంచి పనుల గురించి చెబితే ఆయనకే గౌరవం పెరుగుతుంది’ అని కోమటిరెడ్డి అన్నారు. మూసీ నదిపై కేటీఆర్ ప్రజంటేషన్ ఇస్తే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. మూసీతో నల్లగొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.