Share News

వచ్చే మూడేళ్లు అభివృద్ధిపైనే దృష్టి

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:36 AM

వచ్చే మూడేళ్లు అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని, ఎవరినీ విమర్శించబోనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నల్లగొండ పట్టణ సమీపంలోని ఛాయా సోమేశ్వరాలయం...

వచ్చే మూడేళ్లు అభివృద్ధిపైనే దృష్టి

  • ఎవరినీ విమర్శించను: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే మూడేళ్లు అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని, ఎవరినీ విమర్శించబోనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నల్లగొండ పట్టణ సమీపంలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మునిసిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ 90 మునిసిపాలిటీల్లో గెలిస్తే, బీఆర్‌ఎస్‌ కేవలం 16 మునిసిపాలిటీల్లోనే గెలిచిందని చెప్పారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత స్థాయికి తాను తగ్గి మాట్లాడబోనన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉండటం సహజమన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, రాష్ట్రం వచ్చిన తర్వాతే మంత్రి పదవి చేపడతానని గతంలో తాను అన్న మాటకు కట్టుబడి ఉండి మంత్రి పదవి చేపట్టానని తెలిపారు. నల్లగొండ అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరగా, ఆయన అంగీకరించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూ చించినట్లు పేర్కొన్నారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రపంచ వారస త్వ సంపదగా యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - Feb 16 , 2026 | 02:36 AM