రహదారుల నిర్మాణంలో వేగం పెంచండి
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:58 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం.. ‘‘న భూతో న భవిష్యతి’’ అన్న రీతిలో రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణానికి కట్టుబడి ఉందని రహదారులు..
2027 డిసెంబరుకు హైకోర్టు, ఉస్మానియా సిద్ధమవ్వాలి
అధికారులతో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, జూలై 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం.. ‘‘న భూతో న భవిష్యతి’’ అన్న రీతిలో రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణానికి కట్టుబడి ఉందని రహదారులు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తన శాఖ పరిధిలో ప్రస్తుతం జరుగుతోన్న వివిధ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. హ్యామ్ పథకం కింద జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే ప్రారంభమైన నల్లగొండ-మహబూబ్‌నగర్ రహదారి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ నెల 6న కరీంనగర్ జిల్లాలో హ్యామ్, సీఆర్‌ఎఫ్ రోడ్ల పనుల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న నూతన హైకోర్టు భవనం, జడ్జిల నివాస సముదాయంతోపాటు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల పనులను వేగవంతం చేసి 2027 డిసెంబరు నాటికి ప్రారంభానికి సిద్థం చేయాలని స్పష్టం చేశారు. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు.