Minister Seethakka: మేడారంలో కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:20 AM
మేడారం మహా జాతర ప్రదేశంలో గిరిజన యోధులైన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్లు పంచాయతీరాజ్....
ఈసారి ఇప్ప లడ్డూలతో అమ్మవార్లకు ప్రసాదాలు: సీతక్క
ములుగు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతర ప్రదేశంలో గిరిజన యోధులైన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గిరిజన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా మేడారం జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సమ్మక్క, సారలమ్మల గద్దెల చుట్టూ ఉన్న రాతి స్తంభాలపై ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, గొట్టుగోత్రాలు, పూజిత వృక్షాల వంటి అనేక చిత్రాలను చెక్కించామని, వాటిలో ఏవైనా మార్పులు చేయటానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు ఈసారి అమ్మవార్లకు ఇప్ప పువ్వుతో చేసిన లడ్డూలను ప్రసాదంగా సమర్పిస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో గద్దెల పనులు పూర్తవుతాయని వివరించారు.