కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్‌ను గద్దె దించాం
ABN , Publish Date - May 13 , 2026 | 04:00 AM
నాలుగేళ్లలో టీజేఎస్ ఏం సాధించిందంటే.. కేసీఆర్‌ను గద్దె దించిందని ప్రజలకు గట్టిగా చెప్పండి’’ అని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూచించారు.
ఇదే విషయాన్ని ప్రజలకు గట్టిగా చెప్పండి
వచ్చేసారి అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం
తెలంగాణ జన సమితి ప్లీనరీలో కోదండరాం
ఖైరతాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘‘నాలుగేళ్లలో టీజేఎస్ ఏం సాధించిందంటే.. కేసీఆర్‌ను గద్దె దించిందని ప్రజలకు గట్టిగా చెప్పండి’’ అని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. కేసీఆర్ హయాంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేశారు. టీజేఎస్ ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మంగళవారం ప్లీనరీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కోదండరాంను మరో సారి ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను ఈ ఒక్క సారే ఉంటానని, వచ్చే ఏడాది కొత్త వారికి అవకాశం ఇస్తానని కోదండరాం ప్రకటించారు. మొత్తం 23 తీర్మానాలను ప్లీనరీ ఆమోదించింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాజకీయ ఆలోచనలతోనే నాడు టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్‌ఎస్) ఉద్యమంలో పాల్గొందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తామే తెచ్చామని చెబుతూ ఉద్యమకారులను అణగదొక్కారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు తమ శక్తి సరిపోదనే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గడీల పాలన అంతమొందిచగలిగామని పేర్కొన్నారు. కేసీఆర్ ఇక బయటకు రాడని, ఫాం హౌస్‌కే పరిమితమవుతాడని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ మధ్య గొడవలకు కుటుంబ పంచాయితీలే కారణమని తెలిపారు.