Share News

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల రికార్డు

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:12 AM

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి రికార్డులు సృష్టించారు. వర్సిటీ విద్యార్థి సాత్విక్‌ అంతర్జాతీయ కంపెనీ నెక్స్‌పర్ట్‌లో..

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల రికార్డు

  • ఓ విద్యార్థికి ఏకంగా 81లక్షల వార్షిక ప్యాకేజీ

  • మొత్తం 6,300 మందికి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి రికార్డులు సృష్టించారు. వర్సిటీ విద్యార్థి సాత్విక్‌ అంతర్జాతీయ కంపెనీ నెక్స్‌పర్ట్‌లో రూ.81లక్షల వార్షిక ప్యాకేజీ సాధించారు. అలాగే, వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌లో రూ.52లక్షలు, రూ.44లక్షలు, రూ.40లక్షలు, రూ.34లక్షల వార్షిక ప్యాకేజీలతో విద్యార్థులు ఎంపికయ్యారని యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ పార్థసారథి వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 150 మంది విద్యార్థులు రూ. 25లక్షలు, 630 మంది విద్యార్థులు రూ.15లక్షల చొప్పున ప్యాకేజీలను దక్కించుకున్నారని పేర్కొన్నారు. గూగుల్‌, హితాచి, తోషిబా, అమెజాన్‌, సర్వీస్‌ నౌ, జేపీ మోర్గాన్‌ వంటి 342 కంపెనీలు యూనివర్సిటీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌ నిర్వహించగా.. దాదాపు 6,300 మంది ఆఫర్లు పొందారని వెల్లడించారు. గత 16 ఏళ్లుగా అర్హత పొందిన విద్యార్థులందరికీ యూనివర్సిటీ వంద శాతం ప్లేస్‌మెంట్స్‌ అందించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో ఎప్పటికప్పుడు అత్యుతన్నత ప్రమాణాలను పాటించడం ద్వారా తమ విద్యార్థులు అద్భుతమైన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సాధిస్తున్నారని స్పష్టం చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 05:12 AM