Share News

కేఎల్‌ వర్సిటీలో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:27 AM

కేఎల్‌ యూనివర్సిటీలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమైంది. ఈనెల 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు విజయవాడ...

కేఎల్‌ వర్సిటీలో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

  • ఇంజనీరింగ్‌తో పాటు అన్ని కోర్సులకు ప్రవేశాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): కేఎల్‌ యూనివర్సిటీలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమైంది. ఈనెల 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు విజయవాడ, హైదరాబాద్‌ క్యాంప్‌సలలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఆదివారం తెలిపారు. ఇంజనీరింగ్‌తో పాటు డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సహా అన్ని కోర్సుల ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుందని ఉపకులపతి పార్థసారధి వర్మ వెల్లడించారు. యూనివర్సిటీ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు, జేఈఈ మెయిన్స్‌ పర్సెంటైల్‌, ఇంటర్‌ మార్కుల ఆధారంగా కూడా విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెరిట్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చేలా స్కాలర్‌షిప్‌ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కౌన్సెలింగ్‌ వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Updated Date - Apr 27 , 2026 | 05:27 AM