Share News

kumaram bheem asifabad- కిస్సా కుర్చీకా...

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:17 PM

మున్సి పాలిటీల వార్డు కౌన్సిలర్ల ఎన్నికల ఘట్టం ముగిసి పరోక్ష పద్ధతిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ దక్కించుకు నేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి గెలుపొందిన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు లు నిర్వహిస్తున్నారు.

kumaram bheem asifabad- కిస్సా కుర్చీకా...
లోగో

- రెండు మున్సిపాలిటీల్లోనూ కీలకంగా మారిన స్వతంత్రులు

- చైర్మన్‌ పదవిని ఇస్తేనే మద్దతిస్తామంటున్న స్వతంత్రులు

- రసవత్తరంగా క్యాంపు రాజకీయాలు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మున్సి పాలిటీల వార్డు కౌన్సిలర్ల ఎన్నికల ఘట్టం ముగిసి పరోక్ష పద్ధతిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ దక్కించుకు నేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి గెలుపొందిన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు లు నిర్వహిస్తున్నారు. ఎలాగైన చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపు తున్నారు. సోమవారం ఆయా మున్సిపాలిటీలలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక జరుగనుం డడంతో ఏ అభ్యర్థి ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఏ పార్టీ చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటుందో ఉత్కంఠ నెలకొంది.

- రెండు పార్టీల వ్యూహం..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ల్లో పీఠాలను దక్కించుకునేదుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పొత్తులపై దృష్టి సారించాయి. ఆసిఫాబాద్‌ మున్సి పాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ కు ఏడు, బీఆర్‌ఎస్‌కు తొమ్మిది, నాలుగు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్య ర్థులే కీలకంగా మారారు. వీరి మద్దతు కూడ గట్టుకొ ని చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు అఫర్లు, నజారానాలు ప్రకటించి వారిని తమవైపుకు తిప్పుకునేందుకు చూస్తున్నాయి. కానీ స్వతంత్రులు తమకే చైర్మన్‌ పదవి ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు పార్టీలకు ఈ ఆంశం తలనొప్పిగా మారింది. చైర్మన్‌ అభ్యర్థిగా తెరపైకి కొత్తగా ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గానూ కాంగ్రెస్‌కు తొమ్మిది, బీఆర్‌ఎస్‌కు 11, బీజేపీకి 5, స్వతంత్రులు నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. ఇక్కడ మా జిక్‌ ఫిగర్‌ కావలంటే బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. బీజేపీ, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకొని చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునేం దుకు అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ ఇక్కడ కీలకం కావడంతో వైస్‌ ఛైర్మన్‌ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు మున్సిపాలి టీల్లో చైర్మన్‌ పీఠాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయో ననే ఉత్కంఠ నెలకొంది.

- పూర్తి స్థాయిలో మెజార్టీ లేక..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేక పోవడంతో హంగ్‌ ఏర్పడింది. దీంతో క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండు మున్సిపాలిటీల్లోను సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగు దూరంలో ఉన్న రెండింటిలోను పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతు న్నాయి. గెలుపొందిన అభ్యర్థులను ఆయా పార్టీలు రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయాలు చేపట్టాయి. ఎలాగైన మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలో రాజకీయ పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. సోమవారం రెండు మున్సిపాలిటీలలో ఉదయం 11 గంటలకు గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణీ స్వకారం అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ హరిత పర్య వేక్షణలో కొనసాగ నుంది. దీంతో ప్రజల్లో మున్సిపాలిటీల్లో ఎవరు పాగా వేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది.

Updated Date - Feb 15 , 2026 | 11:17 PM