Union Minister Kishan Reddy: వరంగల్ కోట భూములను కాపాడండి
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:29 AM
వరంగల్ కోట భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాం డ్ చేశారు. కోట చుట్టూ ఉన్న ప్రాకారాలను కొంత మంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు...
అందులోని అక్రమ కట్టడాలను తొలగించండి
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్/వరంగల్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వరంగల్ కోట భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాం డ్ చేశారు. కోట చుట్టూ ఉన్న ప్రాకారాలను కొంత మంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని అన్నారు. వాటిని తొలగించి, ఆక్రమణకు గురైన భూములను భారత పురావస్తు శాఖ(ఏఎ్‌సఐ)కు స్వాధీనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణలో ఏఎ్‌సఐకి సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉందని, భూ ఆక్రమణదారులకు ఏఎ్‌సఐ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏఎ్‌సఐ అధికారులు 2022లో, అలాగే గత డిసెంబరులో వరంగల్ కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినా.. పరిరక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కోట భూములను ఏఎ్‌సఐకి చెందినవని కాకుండా ప్రభుత్వానివని పేర్కొన్నారని దీంతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో ఏఎ్‌సఐకి అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపారు. వరంగల్ కోట చుట్టూ మట్టి గోడ, రాతి గోడ ఉన్నాయని, కొంతమంది ఇటీవల మట్టిగోడలోని కొంత భాగాన్ని ఆక్రమించారని చెప్పారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.