ఆర్‌ఆర్ టాక్స్ కోసమే రాహుల్ రాక: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:19 AM
ఆర్‌ఆర్(రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి) టాక్స్ వసూళ్ల కోసమే రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఆర్(రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి) టాక్స్ వసూళ్ల కోసమే రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘ఆయనకు రాష్ట్ర ప్రజా సమస్యలపై కనీస అవగాహన ఉన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలుపైౖ రాష్ట్ర పర్యటనకు రాగానే ముందుగా వాటిపై సమీక్షించేవారు. కనీస జవాబుదారీతనం లేని ఆయన నుంచి ఇలాంటివి ఆశించడం రాష్ట్ర ప్రజల దురదృష్టం.’ అని ఎక్స్ వేదికగా కిషన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి మతిమరుపు ఉందేమోగానీ, రాష్ట్ర ప్రజలకు అన్ని గుర్తుంటాయని కిషన్‌రెడ్డి చురకలు వేశారు.