Share News

రాజ్‌నాథ్‌, ప్రహ్లాద్‌ జోషిలతో కిషన్‌రెడ్డి భేటీ

ABN , Publish Date - May 27 , 2026 | 05:27 AM

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లా ద్‌ జోషిలతో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి వేర్వేరుగా...

రాజ్‌నాథ్‌, ప్రహ్లాద్‌ జోషిలతో కిషన్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లా ద్‌ జోషిలతో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హారీష్ బాబుతో కలిసి రాజ్‌నాథ్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన కిషన్‌రెడ్డి.. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై చర్చించారు. శంకుస్థాపనకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కోరారు. ఈ ఎయిర్‌పోర్టు వద్ద డిఫెన్స్‌ శిక్షణ కార్యకలాపాల కోసం ట్రైనింగ్‌ సెంటర్‌తోపాటు టౌన్‌షిఫ్ నిర్మించే ఆలోచనలో ఉన్నామని రాజ్‌నాథ్‌ చెప్పినట్లు సమాచారం. అనంతరం, ప్రహ్లాద్‌ జోషితో భేటీ అయిన కిషన్‌రెడ్డి తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చించారు.

Updated Date - May 27 , 2026 | 05:27 AM