Share News

వేలంలో బొగ్గు గనులను సింగరేణి దక్కించుకోవాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:07 AM

రానున్న బొగ్గు గనుల వేలంలో కొత్త బ్లాకులను దక్కించుకోవడానికి సింగరేణి సిద్ధంగా ఉండాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

వేలంలో బొగ్గు గనులను సింగరేణి దక్కించుకోవాలి

  • కోల్‌ గ్యాసిఫికేషన్‌పై దృష్టి పెట్టండి

  • ఉత్పాదక వ్యయం తగ్గాలి

  • వాస్తవ పరిస్థితులను కార్మికులకు చెప్పండి

  • అధికారులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచనలు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రానున్న బొగ్గు గనుల వేలంలో కొత్త బ్లాకులను దక్కించుకోవడానికి సింగరేణి సిద్ధంగా ఉండాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పాదక వ్యయం తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గనుల వారీగా ఉత్పాదక వ్యయాన్ని లెక్కించి, వాస్తవ పరిస్థితులపై కార్మికులకు అవగాహన కలిగించాలని నిర్దేశించారు. శనివారం సింగరేణిభవన్‌లో సంస్థ పనితీరు, ఆదేశాల అమ లు, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన కేంద్ర బొగ్గు, గనుల శాఖ కార్యదర్శి విక్రమ్‌దేవ్‌ దత్‌, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకా్‌షలతో కలిసి సమీక్ష జరిపారు. విద్యుత్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్ల కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటేనే సంస్థ మనుగడ సాగించగలదని, ఇందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. దేశంలో కోల్‌ గ్యాసిఫికేషన్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రా రంభ దశలో చిన్న స్థాయిలో అయినా ఈ రంగంలో అడుగుపెట్టాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ వినియో గం పెరగనున్నందున తగినంత బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు, రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపా రు. బొగ్గు రవాణా కాంట్రాక్టులను అత్యంత వేగంగా ఖరారు చేయాలని చెప్పారు. సింగరేణి భవిష్యత్‌ అభివృద్థి ప్రణాళికల్లో ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకుని వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని హిత వు చెప్పారు. సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి సమావేశానికి ఆహ్వానం పలుకుతూ బొగ్గు ఉత్పత్తి, రవా ణా, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతు న్న పలు సవాళ్లను కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. సింగరేణికి ‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ’ అన్న హోదాను తొలగించడంతో అటవీ భూముల సేకరణ విషయంలో ఇబ్బందు లు ఎదురవుతున్నాయని నివేదించారు. దీనిపై అతి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ నిచ్చారు. ఒడిశాలోని నైనీ గనిలో ఉత్పత్తవుతున్న బొగ్గు రవాణా విషయంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. సమావేశంలో బొ గ్గు, గనులశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌, బొగ్గు శాఖ సలహాదారు వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 05:07 AM