Share News

kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల కలకలం

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:18 PM

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకు కిడ్నీ బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, తాగునీటి సమస్య, ఆహారపు అలవాట్లతో పాటు వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణితో మూత్రపిండాల సమస్య ఏజెన్సీ వాసులను వేధిస్తోంది. కెరమెరి మం డలం మహరాజ్‌గూడ గ్రామంలో ఐదేళ్లలో 11 మంది కిడ్నీ బాధితులు మృతి చెందారంటే పరిస్థితి తీవ్ర తను అర్థం చేసుకోవచ్చు.

kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల కలకలం
లోగో

- అధికారులు శుద్ధజలం అందించాలని ప్రజల వినతి

కెరమెరి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకు కిడ్నీ బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, తాగునీటి సమస్య, ఆహారపు అలవాట్లతో పాటు వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణితో మూత్రపిండాల సమస్య ఏజెన్సీ వాసులను వేధిస్తోంది. కెరమెరి మం డలం మహరాజ్‌గూడ గ్రామంలో ఐదేళ్లలో 11 మంది కిడ్నీ బాధితులు మృతి చెందారంటే పరిస్థితి తీవ్ర తను అర్థం చేసుకోవచ్చు. కెరమెరి మండలం లోని మహారాజ్‌గూడ, కరంజీవాడ, గోయగాం, లింగాపూర్‌ మండలంలోని లొద్దిగూడ తదితర గ్రామాల్లో మూత్ర పిండాల సమస్య తీవ్రంగా ఉంది. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యతోనే ఈ దుస్థితి నెలకొం దని శుద్ధజలం అందించాలని అధికారులను కోరినా చర్య లు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

- లొద్దిగూడ ప్రాంతంలోనూ..

లింగాపూర్‌ మండలంలోని లొద్దిగూడ, భీమానాయక్‌ తండాలోనూ కిడ్నీ బాధితులు ఉన్నారు. డయా లసిస్‌ కేంద్రాన్ని జైనూరులో ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కెరమెరి మండలం లోని రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గ్రామమైన మహారాజ్‌గూడలో ఐదేళ్ల కాలంలో 11 మంది మూత్ర పిండాల సమస్యతో మృతి చెందగా ప్రస్తుతం పదుల సంఖ్యలో కిడ్నీ బాధివతులు ఉన్నారు. అందులో నలు గురు ప్రస్తుతం డయాలసిస్‌ స్థితికి చేరుకున్నారు. ఈ గ్రామం భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. భగీరథ నీరు మూడు, నాలుగు రోజులకోకసారి రావడంతో ఇతర పనులకు వినియోగిస్తుంటారు. ఏళ్లుగా బావి నీరే తాగుతున్నారు. 35 ఏళ్లు దాటితే కీళ్ల వాపు, ఒళ్లు నొప్పులు అధికమవుతున్నాయి. వీటి నివారణకు తరచూ మాత్రలు వాడటం, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నారు. ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో 50 మంది, సిర్పూర్‌ నియోజక వర్గంలో 46 మంది బాధితులు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యం శుద్ధజలం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇలా చేస్తే మేలు..

అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పడికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో మొదటి దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉం టుందని చెబుతున్నారు. ఏటేటా నీటి పరీక్షలు చేయడం వల్ల ఆ నీరు సురక్షితమా కాదో తెలుసుకు నే అవకాశం ఉంటుంది. దీంతో సురక్షితమైన నీరు అందించడం వల్ల వ్యాధి తీవ్రతను అరికట్టే అవకాశం ఉంటుంది. మారుమూల గిరిజన గ్రామాల్లో సర్వే చేసి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటే కిడ్నీ వ్యాధి బాధితులు పెరుగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.

స్థానికంగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

- నానాజీ, కిడ్నీ వ్యాధి బాధితుడు, గోయగాం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి స్థానికంగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి. నేను మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నాను. కెరమెరి మండల కేంద్రం లోని ఆసుపత్రిలో డయాలసిస్‌ సౌక ర్యం లేక పోవడంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్తున్నా. దీంతో ఆర్థికంగా చితికి పోతున్నాం. ప్రభుత్వం స్పం దించి నీటి సమస్యను పరిష్కరించాలి.

Updated Date - Feb 27 , 2026 | 10:18 PM