Share News

రాజకీయం ముసుగులో అరాచకాలు సహించం

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:30 AM

రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తే సహించే ప్రసక్తి లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

రాజకీయం ముసుగులో అరాచకాలు సహించం

  • కాంగ్రెస్‌ శ్రేణులను బెదిరిస్తే అరెస్టులు తప్పవ్‌

  • అశాంతి సృష్టిస్తే ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్‌ / కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తే సహించే ప్రసక్తి లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా సోమవారం ఖమ్మంజిల్లా ఏదులాపురం మునిసిపాలిటీలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం నగర పాలక సంస్థలో జరిగిన సభల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులను బెదిరిస్తే అరెస్టు చేయిస్తామని తెలిపారు. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్కలూ ఈ నెల 11న ఎన్నికలు ముగిసిన తర్వాత తేలుస్తామని హెచ్చరించారు. ‘మీ దందాలు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. కానీ అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం’ అని స్పష్టం చేశారు. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే మోడల్‌ మునిసిపాలిటీగా తీర్చి దిద్దుతానని ఆయన ప్రకటించారు.

Updated Date - Feb 10 , 2026 | 04:30 AM