Share News

ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హెచ్చార్సీలో ఫిర్యాదు

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:31 AM

ఖమ్మంలో అధికారులు 600 ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ న్యాయవాది ఇమ్మినేని రామారావు మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు.

ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హెచ్చార్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో అధికారులు 600 ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ న్యాయవాది ఇమ్మినేని రామారావు మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. భూదాన్‌ భూముల ప్రాథమిక ఉద్దేశం పేదలకు అండగా ఉండటమేనని.. అలాంటి భూదాన్‌ భూముల్లో ఇళ్లు కట్టుకున్నారని చెప్పి వందల ఇళ్లను నేలమట్టం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 28 , 2026 | 03:31 AM