Khammam Corporators Join Congress: కాంగ్రెస్‌లో చేరిన ఖమ్మం కార్పొరేటర్లు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:54 AM
ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోకాంగ్రెస్‌లో చేరారు.
హైదరాబాద్/ఖమ్మం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి కాంగ్రె్‌సలో చేరగా.. సీఎం రేవంత్ వారిని ఆహ్వానించారు. అలాగే, ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో రెండురోజుల వ్యవధిలో మొత్తం ఎనిమిది మంది కార్పొరేటర్లు కాంగ్రె్‌సలో చేరినట్టయింది. కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో పర్యటించిన రోజే.. హైదరాబాద్‌లో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.