మార్కెట్‌కు పోటెత్తిన ఎర్ర బంగారం
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:44 AM
ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు ఎర్రబంగారం(మిర్చి) పోటెత్తింది. వారంరోజుల క్రితం రోజుకు 30వేల బస్తాల నుంచి 40వేల బస్తాల వరకు వస్తుండగా సోమవారం 50వేల తేజ రకం......
ఈ సీజన్‌లో ఖమ్మంలో 50 వేల బస్తాల రాక
ఖమ్మం మార్కెట్ మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు ఎర్రబంగారం(మిర్చి) పోటెత్తింది. వారంరోజుల క్రితం రోజుకు 30వేల బస్తాల నుంచి 40వేల బస్తాల వరకు వస్తుండగా సోమవారం 50వేల తేజ రకం బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈఏడాది భారీ మొత్తంలో పంట రావడం ఇదే ప్రథమం. కాగా, మార్కెట్లో క్వింటా మిర్చి రూ.19,225 జెండాపాట ధర నిర్ణయించగా.. క్వింటాలు రూ.15వేల నుంచి రూ. 18వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. తాలుమిర్చి క్వింటాలు రూ.8,200 నుంచి రూ.9,500 పలుకుతోంది. కాగా పత్తిని మార్కెట్లో క్వింటాలు గరిష్ఠంగా రూ.7,300 వరకు, కనిష్ఠంగా రూ.4,500 ఆన్‌లైన్ బిడ్డింగ్ ధరలకు కొనుగోలు చేశారు.