కేరళంలోనూ తెలంగాణ మోడల్
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:47 AM
కేరళం రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల మోడల్‌ను అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.
బీజేపీకి ఇక్కడ స్థానం లేదు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కేరళం రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల మోడల్‌ను అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కేరళంలోని మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చే ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలు చేస్తూ ప్రజలమధ్య విభేదాలు పెంచే బీజేపీకి కేరళంలో స్థానం లేదన్నారు.