kumaram bheem asifabad- మైనార్టీల కోసమే విమోచనానికి దూరం
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:16 PM
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కొమ్ముకాస్తూ కాంగ్రెస్ చేసిన పోరాటానికి సంబంధం ఉన్న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి వెనకాడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించే సేవాసంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 17వ తేదీన దీపాలంకరణలతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కొమ్ముకాస్తూ కాంగ్రెస్ చేసిన పోరాటానికి సంబంధం ఉన్న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి వెనకాడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించే సేవాసంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 17వ తేదీన దీపాలంకరణలతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 7 వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామస్థాయి వరకు చేసిన అభివృద్ధిని వివరించడమే దీని లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. రజకార్ల పరిపాలనపై పోరాటం చేసింది. పీవీ నరసింహరావులాంటి అప్పటి కాంగ్రెస్ నాయకులేనని వివరించారు. అయినప్పటికిని ప్రస్తుత ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడానికి మైనార్టీల ఓట్ల కోసం భయపడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమైఖ్యత దినోత్సవం పేరిట నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరుతో నిర్వహించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లిఖార్జున్‌యాదవ్, కోవ విజయ్‌కుమార్, రాష్ట్ర స్పోక్ పర్సన్ మహేష్, నాయకులు పెంటయ్య, సంతోష్, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. మంగళవారం కెరమెరి జోడెఘాట్‌లోని భీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వక్రికరిస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల వారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడినట్టు తెలిపారు. నిజాం ప్రభుత్వం దేశంలో విలీనమైన రోజు కాబట్టి చరిత్రను వక్రికరించకుండా చూడాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.