kumaram bheem asifabad- ఆడించేవారు లేక.. ఆటలకు దూరం
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:00 PM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యా పకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకు పాఠశాల నుంచి కళాశాల స్థా యి వరకు వ్యాయాయ ఉపాధ్యాయులు, అధ్యాప కులు ఉంటే ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది.
- క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు
వాంకిడి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యా పకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకు పాఠశాల నుంచి కళాశాల స్థా యి వరకు వ్యాయాయ ఉపాధ్యాయులు, అధ్యాప కులు ఉంటే ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. గతంలో ఆయా పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. వ్యాయామ అధ్యాప కులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు చదువుతో పాటు క్రీడాస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్నా వ్యాయామ అధ్యాప కులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆటు ఆడించేందుకు పీడీలు ఒక్కరూ లేకపోగా కనీ సం సామాగ్రి కొనుగోలుకు నిధుల కేటాయింపు కూడా లేకుండా పోయింది. ఫలితంగా జూనియర్ కళా శాలల విద్యార్థులు పుస్తకాలకే పరిమితమవుతు న్నారు. ప్రతి శనివారం ఆటలు ఆడించాలని ప్రభు త్వం మార్గదర్శకాల్లో పేర్కొంటున్నా... ఆడించేవారు లేక, వేలాది మంది విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా మరుగున పడుతోందనే ఆవేదన తల్లి దండ్రుల్లో వ్యక్తమవుతోది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫీజుల భారం భరించే స్థోమత లేని పే ద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చేరుతున్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి నాలుగు వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నా రు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థు లు క్రీడల్లో రాణించాలంటే సొంతంగా సాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలసారిగా ఇం టర్ బోర్డు నుంచి వ్యాయామ పరికరాల కొను గోలుకు గతేడాది ప్రత్యేకంగా ఒక్కో కళాశాలకు రూ. 10 వేలు నిధులు సైతం మంజూరుచేసింది. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క వ్యాయామ ఆధ్యాపకుడు లేకపోవడం గమనర్హం ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో సామగ్రి కోను గోలుకు అవకాశం లేకుండా పోయింది. కనీసం నిధులైనా విడుదలైతే క్రీడా సామగ్రిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.
- ఆసక్తి ఉన్నా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆటలు ఆడాలన్న ఆసక్తి ఉన్నా ప్రో త్సాహం కరువైంది. పాఠశాల స్థాయిలో ఆటల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులు కళాశాలల్లో చేరాక సరైన ప్రోత్సాహం లభించక ఆటలకు దూరమవు తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆటల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు క్రీడా కోటా కింద ప్రత్యేక రిజ ర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. ఉన్నత విద్యకు, ప్రభ ుత్వ ఉద్యోగాలకు వీటిని అదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇలాంటి అవకాశాలను కోల్పోతున్నారు. కొందరు సొంతంగా సాధన చేసి క్రీడల్లో రాణిస్తున్నారు. కానీ జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోతు న్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధకులే వ్యాయా మ అధ్యాపకులుగా వ్యవహారిస్తున్నారు. దీంతో ప్రోత్సాహం కరవై క్రమంగా విద్యార్థులకు ఆటలపై ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా పీడీ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
- నియామకాలు లేవు..
ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతంలో వెలువడిన ఉద్యోగ ప్రకటనలో పీడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కొందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో పాఠశాలల్లో పని చేస్తున్న వారికి ఇంటర్ కళాశాలల పీడీలుగా పదోన్నతి కల్పించేవారు. ఇదికూడా పదేళ్లుగా నిలిచిపోవడంతో కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టు ఉందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
క్రీడలు ఆడలేక పోతున్నాం..
జాడి. కార్తిక్- విద్యార్థి
ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేక క్రీడలు ఆడలేక పోతున్నాం. ఏళ్ల తరబడి ప్రభుత్వం వ్యాయామ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంలేదు. దంతో కళాశాలల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న కనబర్చలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే వ్యాయామ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి.
వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది..
- రాందాస్ - డీఐఈవో
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. ప్రభుత్వ పరిగణలో ఉంది. క్రీడా సామగ్రి కొనుగోలుకు ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం ఆయా కళా శాలల్లో క్రీడలపై అవగాహన ఉన్న అధ్యాపకులతోనే క్రీడలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం.